Razole: రాజోలులో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 28వ రోజుకు చేరింది.

Razole: కోనసీమ జిల్లా రాజోలులో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 28వ రోజుకు చేరింది. పే స్కేల్, క్రమబద్ధీకరణ డిమాండ్లతో నిరసనను వేగవంతం చేశారు.

PRABHU, RAZOLE
Published on: 13 Oct 2026 2:04 PM IST
Razole
X

Razole: రాజోలులో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం 28వ రోజుకు చేరింది.

Razole: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం, పోరాట సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలానికి చెందిన వీఆర్ఏల సంఘ సభ్యులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గత 28 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన స్పందన రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు:

వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి. వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి. నామినీ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయాలి.

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వీఆర్ఏల సంఘ సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది వీఆర్ఏలు 28 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

గ్రామస్థాయిలో ప్రభుత్వ పరిపాలన, ప్రజలకు సేవలందించడంలో వీఆర్ఏల పాత్ర కీలకమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వారు కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని, ఈ పత్రికా ప్రకటన ద్వారా మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని వీఆర్ఏల సంఘ సభ్యులు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE