Razole: రాజోలు పంట కాలువలో రెండు భారీ త్రాచుపాముల సయ్యాట!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాటన్ పార్క్ సమీపంలోని ప్రధాన పంట కాలువలో రెండు భారీ త్రాచుపాములు పెనవేసుకుని సయ్యాట ఆడుతున్న అరుదైన దృశ్యం.

PRABHU, RAZOLE
Published on: 27 Nov 2026 10:33 PM IST
Razole
X

Razole: రాజోలు పంట కాలువలో రెండు భారీ త్రాచుపాముల సయ్యాట!

రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండల కేంద్రంలోని కాటన్ పార్క్ సమీపంలో ప్రధాన పంట కాలువలో రెండు భారీ త్రాచుపాములు సందడి చేశాయి.

కాలువలో ప్రవహిస్తున్న నీటికి అనుగుణంగా రెండు సర్పాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుంటూ సయ్యాట సాగించడం చూపరులను అబ్బురపరిచింది.

ఒకేసారి రెండు భారీ సర్పాలు నీటిలో ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ప్రకృతి ఒడిలో చోటుచేసుకున్న ఈ అరుదైన దృశ్యం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE