Razole: రాజోలులో పీవోలు, ఏపీవోలకు పరిషత్ ఎన్నికల శిక్షణ

Razole: రాజోలు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పీవోలు, ఏపీవోలకు శిక్షణ. పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించిన ఆర్వో పి. భగవాన్.

PRABHU, RAZOLE
Published on: 2 Nov 2026 5:06 PM IST
Razole
X

Razole: రాజోలులో పీవోలు, ఏపీవోలకు పరిషత్ ఎన్నికల శిక్షణ

రాజోలు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజోలు మండలానికి కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు (పీవోలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవో)లకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ శిక్షణలో ఎన్నికల విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ, ఎన్నికల నియమ నిబంధనలు, బ్యాలెట్ విధానం, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) పి. భగవాన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్వో) కె. వెంకటేశ్వరరావు, ఎంఈఓ టీఎస్‌కేడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE