Razole: అరవపాలెంలో అన్నసమారాధన: టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య
Razole: రాజోలు మండలం అరవపాలెంలో బాల గణపతి యూత్ నిర్వహించిన అన్నసమారాధనలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు.
Razole: అరవపాలెంలో అన్నసమారాధన: టీడీపీ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య
రాజోలు: రాజోలు మండలం అరవపాలెం గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద ‘బాల గణపతి యూత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, వినాయకుడి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు స్వయంగా తీర్థప్రసాదాలు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. భక్తులు, గ్రామస్థులు కలిసి నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెగా ఫోర్స్ యూత్ అధ్యక్షులు ముత్యాల సత్తిబాబు, సాధనాల రమేష్, నెదూరి బాబి, అల్లు సురేష్, పోతురాజు దొరతో పాటు స్థానిక నాయకులు, టీడీపీ కార్యకర్తలు, బాల గణపతి యూత్ సభ్యులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




