Sivakoti: పదవీ విరమణ చేసిన ఎంపీటీసీలకు ఘన సత్కారం
Sivakoti: శివకోటి టీడీపీ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఎంపీటీసీలను నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య ఘనంగా సత్కరించారు.
Sivakoti: పదవీ విరమణ చేసిన ఎంపీటీసీలకు ఘన సత్కారం
శివకోటి: రాజోలు మండలం శివకోటిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఎంపీటీసీలను రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య ఘనంగా సత్కరించారు. ప్రజాసేవలో భాగంగా వారు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చెట్టి బాబు, ఏఎంసీ చైర్మన్ కేతా లక్ష్మి, నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




