Tatipaka: తాటిపాకలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం
Tatipaka: రాజోలు మండలం తాటిపాకలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులను ఫిర్యాదు అందిన 2 గంటల్లోనే పోలీసులు క్షేమంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.
Tatipaka: తాటిపాకలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం
రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం తాటిపాకలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. చిన్నారులు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చేపట్టి చిన్నారుల ఆచూకీని గుర్తించారు.
చిన్నారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వారిని తల్లిదండ్రులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చిన్నారులు ఎక్కడికి వెళ్లారు, ఎలా అదృశ్యమయ్యారు, ఎక్కడ గుర్తించారు అనే పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.




