Malikipuram: దిండిలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండిలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

PRABHU, RAZOLE
Published on: 5 Nov 2026 12:55 PM IST
Malikipuram
X

Malikipuram: దిండిలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!

Malikipuram: మలికిపురం మండలం దిండి గ్రామంలో నిర్వహిస్తున్న పరిషత్ ఎన్నికల సందర్భంగా రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా, బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు వేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE