Razole: రన్నింగ్‌‌లో ఉన్న పాల లారీ చక్రం ఊడిపడి పెను ప్రమాదం తప్పింది

Razole: రాజోలు మండలం తాటిపాకలో కదులుతున్న పాల లారీ చక్రం ఊడిపోయి బైక్‌లను ఢీకొట్టింది. స్థానికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

PRABHU, RAZOLE
Published on: 5 Oct 2026 7:50 PM IST
Razole
X

Razole: రన్నింగ్‌‌లో ఉన్న పాల లారీ చక్రం ఊడిపడి పెను ప్రమాదం తప్పింది

రాజోలు: రాజోలు మండలం తాటిపాకలో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తాటిపాక నుంచి మామిడికుదురు వైపు వెళ్తున్న పది టైర్ల పాల లారీకి రన్నింగ్‌లో ఉండగానే ఓ చక్రం ఊడిపోయింది.

వేగంగా దూసుకెళ్లిన చక్రం రహదారి పక్కన ఉన్న రెండు బైక్‌లను ఢీకొనడంతో అవి పూర్తిగా ధ్వంసమైనట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాద సమయంలో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ వాహనాల ఫిట్‌నెస్‌, టైర్ల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE