Razole: కూటమి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత!

Razole: రాజోలులో కూటమి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన గొల్లపల్లి అమూల్య. మామిడికుదురు జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆయనే బీ-ఫారమ్ సమర్పణ.

PRABHU, RAZOLE
Published on: 27 Oct 2026 4:43 PM IST
Razole
X

Razole: కూటమి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత!

రాజోలు: రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమి తరఫున ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ బి-ఫారాలను రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య అందజేశారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ అధికారికంగా బి-ఫారాలు అందజేశారు.

అనంతరం మామిడికుదురు మండల జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న గొల్లపల్లి అమూల్య, టీడీపీ అధిష్ఠానం నుంచి అందిన బి-ఫారాన్ని ఎన్నికల అధికారులకు సమర్పించారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు ఆమె అభినందనలు తెలిపారు. కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రజల మద్దతుతో విజయం సాధించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE