Razole: రాజోలులో కూటమి క్లీన్ స్వీప్: నాలుగు జడ్పీటీసీలు కైవసం!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 4 జడ్పీటీసీల్లో టీడీపీ 2, జనసేన 2 స్థానాల్లో ఘన విజయం సాధించాయి.
Razole: రాజోలులో కూటమి క్లీన్ స్వీప్: నాలుగు జడ్పీటీసీలు కైవసం!
రాజోలు: రాజోలు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. నాలుగు మండలాల్లో పోటీ చేసిన కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించి విజయదుందుభి మోగించారు. భారీ మెజార్టీలతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి నాలుగు స్థానాలనూ కూటమి ఖాతాలో వేసుకున్నారు.
విజేతల వివరాలు:
మామిడికుదురు: గొల్లపల్లి అమూల్య (టీడీపీ)
రాజోలు: కాండ్రేగుల రామకృష్ణ (టీడీపీ)
- మలికిపురం: మల్లిపూడి సత్తిబాబు (జనసేన)
సఖినేటిపల్లి: ఎనుముల రవి (జనసేన)
రాజోలు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ విజయంతో ఆయా మండలాల్లో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.




