Razole: గణేష్ నిమజ్జనం విజయవంతం: రాజోలు సీఐ సురేష్‌బాబుకు అభినందనలు

Razole: వర్షంలోనూ గణేష్ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన రాజోలు సీఐ వి. సురేష్ బాబును తాలూకా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అభినందించారు.

PRABHU, RAZOLE
Published on: 24 Sept 2026 7:50 PM IST
Razole
X

Razole: గణేష్ నిమజ్జనం విజయవంతం: రాజోలు సీఐ సురేష్‌బాబుకు అభినందనలు

రాజోలు: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించిన రాజోలు సీఐ వి.సురేష్ బాబును రాజోలు తాలూకా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

బుధవారం తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురిసినప్పటికీ, నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయింది.

ఈ సందర్భంగా రాజోలు తాలూకా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాజోలు సీఐ కార్యాలయానికి వెళ్లి సీఐ సురేష్ బాబును కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భద్రతా చర్యలు చేపట్టి, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా సహకరించిన పోలీసు సిబ్బందిని కూడా కమిటీ సభ్యులు అభినందించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో విధులు నిర్వహించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE