Razole: నాలుగు మండలాల్లోనూ జడ్పీటీసీ స్థానాలు కూటమి అభ్యర్థులకే!

Razole: రాజోలు నియోజకవర్గంలో కూటమి అఖండ విజయం. మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు మరియు అన్ని జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి.

PRABHU, RAZOLE
Published on: 8 Nov 2026 10:04 AM IST
Razole
X

Razole:నాలుగు మండలాల్లోనూ జడ్పీటీసీ స్థానాలు కూటమి అభ్యర్థులకే!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో (మామిడికుదురు మండలంలోని ఏడు గ్రామాలతో కలిపి) మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

పార్టీల వారీగా చూస్తే జనసేన పార్టీ 29, తెలుగుదేశం పార్టీ 24, వైఎస్సార్‌సీపీ 12, బీజేపీ 2, ఇతరులు 4 స్థానాలను దక్కించుకున్నారు. వీటికి అదనంగా జనసేన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కూటమి బలం మరింత స్పష్టమైంది.

మరోవైపు నాలుగు మండలాల్లోని జడ్పీటీసీ స్థానాలన్నింటినీ కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఇందులో రెండు స్థానాల్లో జనసేన, మరో రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో రాజోలు నియోజకవర్గంలో కూటమి రాజకీయ బలం మరోసారి వెల్లడైందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE