Razole: రాజోలులో పంచాయతీ ఎన్నికల బరిలో 331 మంది.. 52 వార్డులు ఏకగ్రీవం

Razole: రాజోలు మండల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌కు 45 మంది, వార్డు సభ్యులకు 286 మంది పోటీ; 52 వార్డులు ఏకగ్రీవమని ఎంపీడీవో కే.వెంకటేశ్వరరావు వెల్లడి.

PRABHU, RAZOLE
Published on: 21 Nov 2026 10:59 PM IST
Razole
X

Razole: రాజోలులో పంచాయతీ ఎన్నికల బరిలో 331 మంది.. 52 వార్డులు ఏకగ్రీవం

రాజోలు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం, 2026 నవంబర్ 21వ తేదీ నాటికి సర్పంచ్ పదవులకు 45 మంది, వార్డు సభ్యుల పదవులకు 286 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ప్రకటించడమైనది.

మండలవ్యాప్తంగా సర్పంచ్ పదవులకు మొత్తం 83 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 395 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజోలు మండలంలో మొత్తం 186 వార్డులు ఉండగా, వాటిలో 52 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 134 వార్డులకు యథావిధిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే.వెంకటేశ్వరరావు తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE