Razole: రాజోలులో 16 మంది సర్పంచ్, 32 మంది వార్డు అభ్యర్థుల ఉపసంహరణ

Razole: కోనసీమ జిల్లా రాజోలు మండలంలో పంచాయతీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లలో 16 మంది సర్పంచ్, 32 మంది వార్డు అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు ఎంపీడీఓ తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 20 Nov 2026 7:58 PM IST
Razole
X

Razole: రాజోలులో 16 మంది సర్పంచ్, 32 మంది వార్డు అభ్యర్థుల ఉపసంహరణ

రాజోలు: రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు– 2026లో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

మండలవ్యాప్తంగా సర్పంచ్ పదవులకు మొత్తం 83 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 395 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో నవంబర్ 20వ తేదీ నాటికి 16 మంది సర్పంచ్ అభ్యర్థులు, 32 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే.వెంకటేశ్వరరావు వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని తెలిపారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE