Ravulapalem: రావులపాలెం జెడ్పీటీసి బరిలో సత్యలక్ష్మి, లావణ్య!

Ravulapalem: రావులపాలెం జెడ్పీటీసీ బరిలో కూటమి అభ్యర్థిగా చిన్నం సత్యలక్ష్మి, వైకాపా అభ్యర్థిగా మల్లిడి లావణ్య బరిలో నిలిచారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 21 Oct 2026 4:54 PM IST
Ravulapalem
X

Ravulapalem: రావులపాలెం జెడ్పీటీసి బరిలో సత్యలక్ష్మి, లావణ్య!

Ravulapalem: రావులపాలెం మండల జడ్పిటిసి అభ్యర్థిని శ్రీమతి చిన్నం సత్యలక్ష్మి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అభ్యర్థి ఎంపిక మాజీ సర్పంచ్ ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ కె వి సత్యనారాయణ రెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సతీష్ రాజు కలిసి నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభ్యర్థిని ఎంపిక చేశారు. జడ్పిటిసి అభ్యర్థి తెలుగుదేశం రావులపాలెం ఉపసర్పంచ్ కొవ్వూరు జగన్నాథ రెడ్డి కుమార్తె సత్యలక్ష్మి కూటమి అభ్యర్థి కావటం జనసేన ఓటింగ్ యువత కలిసి వచ్చే అవకాశం ఉంది.

వైయస్సార్ సిపి జడ్పిటిసి అభ్యర్థి మల్లిడి లావణ్యను ఎంపిక చేశారు ఆమె గతంలో ఓబలంక మాజీ సర్పంచ్ గా పనిచేశారు. శ్రీమతి మల్లిడి లావణ్య రాము రెడ్డి రాజకీయ కుటుంబం ఆమె భర్త రాము రెడ్డి మండలంలో మంచి పరిసరాలు కలిగిన వ్యక్తిగా పేరు ఉంది అభ్యర్థులు ఇరువురు ఒకే సామాజిక వర్గం కావడంతో ఎవరు ఆధిక్యతను చాటుకుంటారో వేచి చూడవలసింది.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA