Konaseema: రావులపాలెం వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!

Konaseema: కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించి, అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 8 Oct 2026 5:40 PM IST
Konaseema
X

Konaseema: రావులపాలెం వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!

Konaseema: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో రావులపాలెం పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి రెండు వాహనాలను సీజ్ చేశారు. రావులపాలెం టౌన్ సీఐ రమేష్ బాబుకు అందిన సమాచారంతో ఎస్‌ఐ చంటి, పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా వైపు నుంచి వస్తున్న రెండు వాహనాలను తనిఖీ చేయగా, 50 కిలోల చొప్పున బియ్యం ఉన్న మొత్తం 90 బస్తాలు గుర్తించారు. అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA