Ravulapalem: రావులపాలెం అరటి మార్కెట్‌లో దళారుల దోపిడీ

Ravulapalem: రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో దళారుల పెత్తనం పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు స్పందించి నిఘా పెట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 19 Oct 2026 4:17 PM IST
Ravulapalem
X

Ravulapalem: రావులపాలెం అరటి మార్కెట్‌లో దళారుల దోపిడీ

రావులపాలెం: రావులపాలెంలో అరటి మార్కెట్ కు పెట్టింది పేరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు అరటి అగ్రగామి వ్యాపారంగా ఇక్కడ విరాజల్లుతుంది. 1980 దశకములో అరటి మార్కెట్ అప్పుడే ఉంది అప్పుడు ప్రైవేట్ వర్తకుల చేతుల్లో ఉండి దళారీలు తో రైతులు దెబ్బతింటున్నారని తెలుగుదేశం హయాంలో రావులపాలెంలో మార్కెట్ యార్డ్ ఉండాలని రైతులకు నేరుగా మార్కెట్లో అమ్ముకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ యాడ్ నిర్మాణం జరిపి నేరుగా తమకు నచ్చిన రేటు రైతులే అమ్ముకునే ఏర్పాటు చేసింది.

ఇటీవల రైతులకు వ్యాపారులకు మధ్య దళారీలు పెరిగి అటూ ఇటూ దోసుకుంటున్నారు అరటి గెలలపై పెత్తనం చాలా ఇస్తూ దళారీలు నిర్ణయించిన ధరకే అటు రైతు వద్ద ఇటు వ్యాపార వద్ద రెండు వైపులా దోచుకుని దళారీలు కోటీశ్వరులు అయిపోతున్నారు రైతు మాత్రం రోజు కూలి కోసమే ఉన్నట్టు ఉంది పరిస్థితి.

మార్కెట్ యార్డ్ లో రైతులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి దళారీలు బెడద లేకుండా చూసి రైతు తనకు నచ్చిన రేటుకి అమ్ముకునేలా చేసే యార్డు అధికారులు నిమ్మకు మీరు ఎత్తినట్లు చోద్యం చూస్తున్నారు. దళారీల నుండి మామూలు అందతంతో మార్కెట్ యార్డ్ అధికారులు వేల రూపాయలు జీతాలు తీసుకుంటూ దళారీలకు కొమ్ముకాస్తున్నారు.

దీనికి పాలకవర్గం ఉన్నప్పటికీ మీటింగులు సమయంలో తప్ప మిగతా సమయం అంతా పాలకవర్గం వాళ్లు పని చూసుకుంటూ ఉంటారు తప్ప దీనిపై నిఘా ఉంచితే దళారీలను అరికట్టవచ్చని అరటి రైతులు వాపోతున్నారు.

అరటి రైతులు తెల్లవారుజాముని తోటల్లో అరటి గెలలు సైకిళ్లకు మోటార్ సైకిల్ కు కట్టుకుని 10 గంటల వరకు ఉదయం అయ్యేసరికి వ్యాపారమంతా చక్కబెట్టుకోవాలని తర్వాత వ్యవసాయ పనులకు వెళ్లాలని తొందరగా అమ్ముకోవాలన్న అవసరాన్ని దళారీలు పొంచి ఉండి మీరు శ్రమను నిత్యము చూసుకుంటున్నారు. దీనిపై యార్డు పాలకవర్గం అధికారులు కలసి చర్యలు తీసుకుంటే గాని యాడ్లో పరిస్థితి దారిలోకి రాదని రైతులు తమ గోడు వినాలని కోరుతున్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA