Rampachodavaram: చిలకమామిడి పాఠశాలలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో కంపాస్ బాక్స్‌ల పంపిణీ!

Rampachodavaram: రంపచోడవరం చిలకమామిడి పాఠశాలలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంపాస్ బాక్స్‌ల పంపిణీ. విద్యార్థుల ఉన్నత చదువులకు ట్రస్ట్ భరోసా.

Prasanna, Rampachodavaram
Published on: 23 Oct 2026 10:49 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: చిలకమామిడి పాఠశాలలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో కంపాస్ బాక్స్‌ల పంపిణీ!

రంపచోడవరం: పోలవరం జిల్లా, రంపచోడవరం మండలం వేదాగ్ని ట్రస్ట్ అధినేత శ్రీ మంజు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చిలక మామిడి పాఠశాలలో విద్యార్థులకు కంపాస్ బాక్స్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి వేదాగ్ని ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జి చిన్నం టోనీ బాబు, చిన్నం కుమారి, పంజా ఆది రెడ్డి, చెదల రామిరెడ్డి, స్వరూప రాణి, సుంకరి దుర్గ రెడ్డి పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram