Rampachodavaram: స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి!
Rampachodavaram: రాబోయే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
Rampachodavaram: స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి!
Rampachodavaram: అమరావతి నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్,జిల్లా ఎస్పీ కె.చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ డి. పృద్వి రాజ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కరరావు, జడ్పీ సీఈవో పురుషోత్తం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలవరం జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్షించారు.
ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా,నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తగిన శిక్షణ అందించడం,బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. ప్రశాంతమైన వాతావరణం లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.




