Rampachodavaram: ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ యోజన సేవా సేతు క్యాంపు!
Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ యోజన సేవా సేతు క్యాంపు నిర్వహణ. సోలార్ రూఫ్‌టాప్‌లపై అవగాహన.
Rampachodavaram: ప్రధాన్ మంత్రి సూర్య ఘర్ యోజన సేవా సేతు క్యాంపు!
Rampachodavaram: తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రంపచోడవరం డివిజన్ పరిధిలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కార్యక్రమంలో భాగంగా సేవా సేతు క్యాంప్ రంపచోడవరం డివిజన్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికారులు మరియు వెండర్లు (కాంట్రాక్టర్ లు ) పాల్గొని సోలార్ వినియోగం మరియు ప్రయోజనాలు కోసం వినియోగదారులకు వివరించిన అనంతరం సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొనుటకు వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం అక్టోబర్ 17 తేది వరకు నిర్వహిస్తున్న కారణంగా ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మంకల రావు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, జూనియర్ ఇంజనీర్ ప్రసాద్ మరియు సిబ్బంది,వినియోగదారులు, కాంట్రాక్టర్ లు పాల్గొనడం జరిగినది.




