Ramachandrapuram: రామచంద్రపురం టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా మేడిశెట్టి

Ramachandrapuram: రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా మేడిశెట్టి శేషారావు మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి ఘనంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Oct 2026 4:20 PM IST
Ramachandrapuram
X

Ramachandrapuram: రామచంద్రపురం టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా మేడిశెట్టి

రామచంద్రపురం: రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మేడిశెట్టి శేషారావు... ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అమ్మవారిని, శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మేడిశెట్టి శేషారావు దంపతులు.

ద్రాక్షారామ నుంచి ర్యాలీగా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి రాష్ట్ర మంత్రి సుభాష్ తో కలిసి మున్సిపల్ కార్యాలయం లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన మేడిశెట్టి శేషారావు.

మంత్రి సుభాష్ మీడియా తో మాట్లాడుతూ... గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం మున్సిపాలిటీ నుంచి తనకు 8500 మెజార్టీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తాము బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు ను 12 వేల నుంచి 15 వేల ఓట్లు మెజార్టీ తో గెలిపించాలని కోరిన మంత్రి.

రెండున్నరేళ్లలో రామచంద్రపురం మున్సిపాలిటీలో సుమారు 80 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశాం, సంక్షేమ పథకాలు అందించాం.. మున్సిపాలిటీలో 32 వార్డులో బలమైన అభ్యర్థులను అభ్యర్థులను బరిలో దించాం. అభివృద్దే ప్రధాన అజెండాగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాం. అభివృద్ధి చేశాం.. ప్రజలు మంచి మనసుతో తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన మంత్రి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్