Ramachandrapuram: మంత్రి పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Ramachandrapuram: రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పేరుతో దందాలు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మంత్రి ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Oct 2026 7:04 PM IST
Ramachandrapuram
X

Ramachandrapuram: మంత్రి పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

రామచంద్రపురం: రామచంద్రపురం లో మంత్రి వాసంశెట్టి శుభాష్ పేరుతో దందాలు. మంత్రి ఆదేశాలతో ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రామచంద్రపురం పోలీసులు. హోటళ్లు,టిఫిన్ సెంటర్లు టార్గెట్ గా వసూళ్లకు పాల్పడుతున్న ముఠా. హోటల్స్ టిఫిన్ సెంటర్లలో ఫుడ్,టిఫిన్ బాగోలేదంటూ దౌర్జన్యం, వీరంగం చేస్తున్న ముఠా.

హోటల్స్, టిఫిన్ సెంటర్ల యజమానులను బెదిరించి లక్ష రూపాయలు వసూలు చేసిన ముఠా సభ్యులు. మంత్రికి సన్నిహితులం,ఫుడ్ ఇన్స్పెక్టర్ తమకు బాగా తెలిసినంటూ చెప్పుకుని దందాలు చేస్తున్న ముఠా. దీంతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్న హోటల్స్, టిఫిన్ సెంటర్ల యజమానులు..

తక్షణమే స్పందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, వాసంశెట్టి సుభాష్ ఫోన్ లో సిఐ తో మాట్లాడి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దందాకు పాల్పడుతున్న ముఠా లోని ముగ్గురు సభ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన రామచంద్రపురం పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్