Rajanagaram: మధురపూడిలో రూ.1.29 కోట్లతో రహదారి పనులు!

Rajanagaram: రాజానగరం మండలం మధురపూడిలో రూ.1.29 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 1 Oct 2026 10:37 AM IST
Rajanagaram
X

Rajanagaram: మధురపూడిలో రూ.1.29 కోట్లతో రహదారి పనులు!

Rajanagaram: కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో రూ.1.29 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం శంకుస్థాపన చేశారు. మధురపూడి దుర్గమ్మ గుడి వద్ద నుండి గాడాల తొర్రేడు ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని నాణ్యమైన రహదారులతో అనుసంధానించడమే తమ కర్తవ్యమని తెలిపారు.దెబ్బతిన్న ఈ రహదారి వల్ల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకే నిధులు కేటాయించామని, నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, పెదకాపు,మేడిశెట్టి బురన్న,పిల్ల వీర వెంకటరావు,గంగ బాబు, ఆకుల ముత్యాలరావు, ఆకుల బుజ్జి, పసలపూడి ముసలయ్య, వెంకటేశ్వర్లు, మేడిశెట్టి సాయి, ప్రసాద్, గణేషుల రాంబాబు, లక్ష్మి సాకే నాగేశ్వరరావుమండల స్థాయి అధికారులు, జనసేన, తెలుగుదేశం,బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM