Rajanagaram: ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు
Rajanagaram: రాజానగరంలోని ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ‘ఐఎస్‌టీఎస్ పల్స్’ మ్యాగజైన్‌ను చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
Rajanagaram: ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు
Rajanagaram: రాజానగరంలోని ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించి, గౌరమ్మకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కళ్లెం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను దైవస్వరూపాలుగా భావించి జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైస్ చైర్మన్ వంగల అనూష రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, సామాజిక ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు విద్యార్థినుల్లో సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
దసరా పండుగను పురస్కరించుకుని కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఐఎస్‌టీఎస్ పల్స్’ మ్యాగజైన్‌ను చైర్మన్ కళ్లెం ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు. కళాశాల విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థినుల ప్రతిభను ప్రతిబింబించేలా మ్యాగజైన్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై. రాజశ్రీ రావు, డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇక్బాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.




