Rajamahendravaram: ప్రజల భద్రతకే ట్రాఫిక్ ఆంక్షలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి!
Rajamahendravaram: 'అర్నాబ్' తుఫాన్ వేళ రాజమహేంద్రవరం బస్టాండ్ వద్ద ప్రజల భద్రతకే ఆంక్షలని రూ.8 కోట్లతో డ్రెయినేజీ పనులు చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి తెలిపారు.
Rajamahendravaram: ప్రజల భద్రతకే ట్రాఫిక్ ఆంక్షలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి!
Rajamahendravaram: అర్నబ్ తుపాను నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరంలోని హైటెక్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తుపాను లో సైతం ఆయన మంగళవారం హైటెక్ బస్టాండ్ వద్ద పరిస్థితిని పరిశీలించి, ట్రాఫిక్, అలాగే సంబంధిత అధికారులతో సమీక్షించారు.
వర్షాలు కురిసిన సమయంలో హైటెక్ బస్టాండ్ ప్రాంతం నీట మునగడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.8 కోట్లతో భారీ డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తుపాను ప్రభావం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పనులు జరిగే సమయంలో ప్రజలు, వాహనదారులు అధికారులకు సహకరించాలని కోరారు. ప్రస్తుత అర్నాబ్ తుపాన్, తుపాన్ తరువాత జరిగే పనుల కోసం తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు ప్రజల ఇబ్బందుల కోసం కాకుండా, భద్రతతో పాటు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసమే విధిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.




