Rajahmundry: తుఫాన్ బాధిత రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే గోరంట్ల!
Rajahmundry: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు.
Rajahmundry: తుఫాన్ బాధిత రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే గోరంట్ల!
Rajahmundry: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. గురువారం జేగురుపాడు, కడియం ,మాధవరాయుడుపాలెం గ్రామాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. రైతులకు ధైర్యం చెప్పారు.
వరి కోత దశలో తుఫాన్ రావడం దురదృష్టం అని ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది అన్నారు. తుఫాన్ ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను అప్రమత్తం చేశారని, రేయింబవళ్లు సమీక్షిస్తూ ప్రాణ నష్టాలు లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారన్నారు.
ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు అడ్డుకోలేమని, తగిన జాగ్రత్తల ద్వారా మాత్రమే మనం నష్టాన్ని అధిగమించగలమని పేర్కొన్నారు. ఉద్యానవన,వరి పంటల రైతులు భారీగా నష్టపోయారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి నేరుగా రైతు ఎకౌంట్లకే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆయన వెంట టిడిపి వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవికిరణ్, టిడిపి రాష్ట్ర రైతు నాయకులు అన్నందేవుల చంటి, కడియం మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, తోట శ్రీను,నాగిరెడ్డి రామకృష్ణ, మర్రెడ్డి రమేష్ , సూరపరెడ్డి జానకిరామయ్య, తమేళ్ల అయ్యప్ప, పలువురు రైతులు పాల్గొన్నారు.




