Rajahmundry: పైడితల్లి అమ్మవారికి వెండి కిరీటం సమర్పణ!

Rajahmundry: రాజమండ్రి తుమ్మలోవ పైడితల్లి అమ్మవారికి హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుటుంబం చేయించిన వెండి కిరీటాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దంపతులు సమర్పించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 18 Oct 2026 8:50 PM IST
Rajahmundry
X

Rajahmundry: పైడితల్లి అమ్మవారికి వెండి కిరీటం సమర్పణ!

రాజమండ్రి: తుమ్మలోవలోని శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్య సన్నిధిలో వెండి కిరీటం సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుటుంబ సభ్యులు అమ్మవారికి భక్తితో చేయించిన వెండి కిరీటాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి వెండి కిరీటాన్ని సమర్పించడం ద్వారా తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు. పైడితల్లి అమ్మవారి దివ్య సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY