Rajahmundry: ఈనెల 10 కల్లా పీవీ నరసింహారావు పార్కు అందుబాటులోకి కమిషనర్
Rajahmundry: రాజమండ్రి పీవీ నరసింహారావు పార్కు పనులను ఈనెల 10 కల్లా పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశం. గోదావరి రివర్ ఫ్రంట్ పనుల నాణ్యతపై కీలక సూచనలు.
Rajahmundry: ఈనెల 10 కల్లా పీవీ నరసింహారావు పార్కు అందుబాటులోకి కమిషనర్
రాజమండ్రి: పీవీ నరసింహరావు పార్కు అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఈనెల 10 వ తేదీ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.
గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను సోమవారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రెయిలింగ్ పెయింటింగ్ కు సంబంధించి పలు సూచనలు చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టాలని స్పష్టం చేశారు. పర్యటనలో ఈఈ మదర్షా అలీ, ఏఈ రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




