Rajahmundry: రాజమండ్రిలో ఆక్రమణల తొలగింపు స్పెషల్ డ్రైవ్ కొనసాగింపు!
Rajahmundry: రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్యల నివారణకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏవీ అప్పారావు, గెయిల్ ఆఫీస్ రోడ్లలో అక్రమ నిర్మాణాలను తొలగించారు.
Rajahmundry: రాజమండ్రిలో ఆక్రమణల తొలగింపు స్పెషల్ డ్రైవ్ కొనసాగింపు!
Rajahmundry: నగరపాలక కమిషనర్ రాహుల్ మీనా ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నగరంలోని రోడ్లు, ఫుట్ పాత్‌లపై ఆక్రమణలను పట్టణ ప్రణాళిక అధికారులు తొలగిస్తున్నారు. ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాద్ ఆదిత్య మాల్ పరిసర ప్రాంతాలు, గెయిల్ కార్యాలయం ఎదురు రోడ్డు నందలి ఆక్రమణలను శనివారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు.
అధికారుల సూచన మేరకు పలువురు స్వచ్ఛందంగానే వాటిని తొలగిస్తుండటంతో రహదారులు, ఫుట్ పాత్ లు విశాలంగా మారాయి. తొలగించిన ప్రాంతాలలో మరలా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. ఆయా ప్రదేశాలు తిరిగి ఆక్రమణకు గురి కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వీధి విక్రయదారులు తోపుడుబండ్లపై లేదా ఇతర వాహనాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్తకం జరుపుకొని తిరిగి తమ ప్రాంతాలకు వాహనాలను తీసుకువెళ్లే విధంగా చూసుకోవాలని, ఒకే ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి శాశ్వత విక్రయాలు జరపడాన్ని సహించమని స్పష్టం చేశారు. పుష్కరాల సన్నద్ధతలో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ ఇదేవిధంగా కొనసాగుతుందని.. కనుక ప్రజలు సహకరించాలని కోరారు.




