Rajahmundry: రాజమండ్రిలో అఖండ భూమి ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం

Rajahmundry: రాజమండ్రిలో అఖండ భూమి పర్యాటక ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఖండించారు. రూ.94.44 కోట్ల నిధుల వివరాలు వెల్లడి.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 29 Sept 2026 9:40 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో అఖండ భూమి ప్రాజెక్ట్‌పై దుష్ప్రచారం

రాజమండ్రి: నగరంలో ప్రభుత్వం చేపడుతున్న చేపడుతున్న అఖండ భూమి పర్యాటక ప్రాజెక్టు పై ప్రతిపక్షాలు, వారి ప్రలోభాలకు గురైన కొన్ని వార్త సంస్థలు దుష్ప్రచారం చేయడం తగదని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఖండించారు.

దేశంలో ఏ రాష్ట్రానికి లేని పర్యాటక ప్రాజెక్టులు, నిధులు కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తుందన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో దుర్గేష్ మాట్లాడుతూ, 20 24 సంవత్సరంలో డిసెంబర్ 13న అఖండ భూమి ప్రాజెక్టుకు డిపి ఆర్ తయారైందని , 2025 లో మరోసారి సవరణ జరిగిందని, 2026లో సాస్కి నిధులు రూ 94.44 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు.

ఈ పనుల్లో రూ.44 కోట్ల రూపాయలతో హావ్ లాక్ బ్రిడ్జి అభివృద్ధి , కడియం నర్సరీల ఎక్స్పీరియన్స్ సెంటర్ నిడదవోలు కోట సత్తెమ్మ తల్లి ఆలయం, శెట్టి పేట గోదావరి కాలువ బోటింగ్ బోటింగ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నిధుల్లో రూ.14కోట్లు జీఎస్టీ పన్నులు చెల్లించాల్సి ఉందన్నారు.

ఈ ప్రాజెక్టు రూపకల్పన, నిధుల పై గత వైసిపి ప్రభుత్వం లోనే మంజూరైనట్లు కొంతమంది వైసిపి నాయకులు దుష్ప్రచారం చేయడం నగర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఉందన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని, పర్యాటకులకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు మీడియా ఇన్ఫ్లేయర్స్ ను ప్రభుత్వం ప్రచారానికి వినియోగించు కుంటుందన్నారు .అయితే ఆయా రంగంలో ప్రతిభా, అర్హత కలిగిన వారిని ఎంపిక చేసుకుంటుందని , వారికే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

వీరికి ఇచ్చే జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వం పర్యాటక పాలసీలోనివే నన్నారు. 2019 2024 లో వైసిపి ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి ,నగరాభివృద్ధికి ఏమి పనులు చేసిందో తెలపాలన్నారు. రానున్న రోజుల్లో మూడు స్టార్ హోటల్స్ నిర్మాణం జరుగుతాయని, గోదావరి పుష్కరాల భక్తులను దృష్టిలో పెట్టుకొని హోం స్టేలు, టెంట్ హౌస్ లు పాలసీలను తెస్తున్నామన్నారు.

అరకు, విశాఖ, లంబసింగి, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం రిసార్ట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 960 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో సూర్యలంక బీచ్, ఇతర బీచ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన కళా, సాంస్కృతిక రంగాలను మళ్లీ గాడిలో పెడుతున్నామని వచ్చే డిసెంబరు, జనవరిలో నంది నాటకోత్సవాలను, నంది పురస్కరాలను అందిస్తామని అన్నారు.

కూటమి పార్టీల్లో చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైసీపీ కుట్రలు చేస్తుందని, వారి వలలో పడొద్దని అన్నారు. రాష్ట్ర పోలవరం గండి పోచమ్మ ఆలయంలో రూ 9 లక్షల రూపాయలతో మహిళలకు మరుగుదొడ్లు నిర్మించామన్నారు పర్యాటక అభివృద్ధికి త్వరలో క్రీడా, సిని రంగాలకి చెందిన బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక జరుగుతోందన్నారు. 2008లో పిపిపి పాలసీలో మంజీరా హోటల్ కు 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చామని, కోవిడ్ కారణాలతో నష్టం జరిగిందని, 63 సంవత్సరాలు లీజుకు పొడిగించమని యాజమాన్యం కోరిందని, ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY