Rajahmundry: జర్మనీలో అధునాతన స్పైన్ సర్జరీపై డా. వర ప్రసాద్ అధ్యయనం!

Rajahmundry: రాజమహేంద్రవరం కిమ్స్ హాస్పిటల్స్ చీఫ్ న్యూరో సర్జన్ డా. జి. వర ప్రసాద్ జర్మనీలోని సెయింట్ అన్నా హాస్పిటల్‌లో అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీపై అధ్యయనం చేశారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 12 Nov 2026 8:57 PM IST
Rajahmundry
X

Rajahmundry: జర్మనీలో అధునాతన స్పైన్ సర్జరీపై డా. వర ప్రసాద్ అధ్యయనం!

Rajahmundry: కిమ్స్ హాస్పిటల్స్, రాజమహేంద్రవరం న్యూరో సర్జన్ డా. జి. వర ప్రసాద్ (MS; MCh న్యూరో) ఇటీవల అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీకి ప్రసిద్ధి చెందిన జర్మనీలోని సెయింట్ అన్నా హాస్పిటల్‌ను సందర్శించారు.

ఈ పర్యటనలో డా. వర ప్రసాద్ ప్రత్యక్ష శస్త్రచికిత్సలను పరిశీలించి, Prof Dr Sebastian Reutten, Dr Mina Mikchael మరియు వారి శస్త్రచికిత్స బృందంతో క్లినికల్ అనుభవాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో ఫుల్-ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో తాజా పద్ధతులపై అవగాహన పొందారు. ఈ విధానంలో చిన్న కోత, హై-డెఫినిషన్ కెమెరా సహాయంతో కణజాలానికి తక్కువ నష్టంతో వెన్నెముక సమస్యలకు చికిత్స చేస్తారు.

ఈ విధానం వల్ల రోగులకు కలిగే ప్రయోజనాలు:

చిన్న కోత, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, తక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండటం, త్వరగా కోలుకోవడం. నిరంతర అభ్యాసం, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ స్థాయి వెన్నెముక చికిత్సను గోదావరి ప్రాంత రోగులకు చేరువ చేయడానికి కిమ్స్ హాస్పిటల్స్, రాజమహేంద్రవరం కట్టుబడి ఉంది అనీ Dr varaprasad గారు తెలిపారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.