Rajahmundry: రాజమండ్రిలో భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తం!

Rajahmundry: రాజమండ్రిలో భారీ వర్షాలు: అధికార యంత్రాంగం అప్రమత్తం, కమిషనర్ రాహుల్ మీనా క్షేత్రస్థాయి పరిశీలన. 24 గంటల మున్సిపల్ కంట్రోల్ రూం నంబర్ 9494060060 ఏర్పాటు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 24 Sept 2026 3:03 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తం!

రాజమండ్రి: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం నగరపాలక అధికారులతో కలిసి వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు, బాలాజీపేటలో పర్యటించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో పరిస్థితిని అంచనా వేసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడా వర్షపు నీరు నిలిచే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ సరఫరా సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రమాదకర హోర్టింగులను వెంటనే తొలగించాలన్నారు. కూలిన చెట్లను తొలగించడంతో పాటు అవసరమైన చోట చెట్ల కొమ్మలను కత్తిరించాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ 9494060060 నెంబర్ 24 గంటలూ పనిచేయాలన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. ప్రభుత్వ సహాయక చర్యలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పర్యటనలో ఈఈ మాధవి, ఎంహెచ్ఓ వినూత్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY