Rajahmundry: పుష్కరాల సన్నద్ధతలో భాగంగా జాంపేటలో ఆక్రమణల తొలగింపు

Rajahmundry: రాజమండ్రి జాంపేటలో పుష్కరాల సన్నద్ధతలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణలను అధికారులు జేసీబీలతో తొలగించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 9 Oct 2026 7:03 PM IST
Rajahmundry
X

Rajahmundry: పుష్కరాల సన్నద్ధతలో భాగంగా జాంపేటలో ఆక్రమణల తొలగింపు

రాజమండ్రి: రానున్న పుష్కరాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు జాంపేటలో రహదారులకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను శుక్రవారం పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. నడక మార్గాలపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాలను జేసీబీలతో తొలగించడంతో ఆయా రోడ్లు విశాలంగా మారాయి.

రహదారుల మార్జిన్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. ఫుట్‌ పాత్‌ లపై వరుసగా బడ్డీలు ఏర్పాటు చేయడంతోపాటు రోడ్డుపైనే వ్యాపార సామాగ్రిని ఉంచడంతో ఆ రోడ్డులో వాహనాలు ఎదురెదురు వస్తే తప్పించడానికి కూడా అవకాశం ఉండడం లేదన్నారు.

ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రజలు నడవడానికి కూడా వీల్లేకుండా పోతుందని.. కావున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడక మార్గాలను స్పష్టంగా గుర్తించి, వాటిపై ఎటువంటి ఆక్రమణలు లేకుండా చూసేందుకు నిరంతర నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల సన్నద్ధతలో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ ఇదేవిధంగా కొనసాగుతుందని.. కనుక ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY