Rajahmundry: కళలకు జీవం పోస్తున్న డాక్టర్ వర్మ అభినందనీయుడు

Rajahmundry: రాజమండ్రిలో గత 19 నెలలుగా కళాకారులు, సామాజిక సేవకులను క్రమం తప్పకుండా సత్కరిస్తున్న ఇంద్రజాలికులు డాక్టర్ చల్లగాలి శ్రీనివాస వర్మ.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 7 Oct 2026 11:03 PM IST
Rajahmundry
X

Rajahmundry: కళలకు జీవం పోస్తున్న డాక్టర్ వర్మ అభినందనీయుడు

రాజమండ్రి: జానపద కళలకు జీవం పోస్తూ సామాజిక సేవకులను సత్కరిస్తున్న ప్రముఖ ఇంద్రజాలికులు కళా ప్రపూర్ణ డాక్టర్ చల్లగాలి శ్రీనివాస వర్మ అభినందనీయులని భారతీయ చైతన్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్ట కృష్ణ ఎ పి ఐ ఎఫ్ డబ్ల్యూ జె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్ లోకనాథం కేవీఎం క్లినిక్ అధినేత కే నాగేంద్ర ప్రసాద్ రావు లు అన్నారు గత 19 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు కళాకారులను ముగ్గురు సంఘ సేవకులను గుర్తించి వారిని ఇంద్రజాలికులు డాక్టర్ శ్రీనివాస్ వర్మ ఘనంగా సత్కరిస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా ముగ్గురు కళాకారులను ముగ్గురు సామాజిక సేవకులను స్థానిక జ్ఞాన సరస్వతి ఘాటు వద్ద డాక్టర్ శ్రీనివాస్ వర్మ ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో కట్టా కృష్ణ లోకనాథం డాక్టర్ ప్రసాదరావు పాల్గొని ప్రసంగించారు పుట్టినరోజులు వర్ధంతులను ఏడాదికోసారి నిర్వహించడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో నెల నెల ఆరుగురిని సత్కరించడం చాలా అరుదైన విషయం అని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ వర్మ అభినందనీయుడని కొనియాడారు అందులో భాగంగా కే రమా లలిత కుమారి నీలి అశోక్ కుమార్ షేక్ మాయా మస్తాన్ నాలం ఆండాళ్ పోలిక గంగాధర దుర్గ పుల్లంరాజు ఉప్పులూరి దేవి ప్రసన్నను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంతో గుండెల నిండా బాధ ఉన్నప్పటికీ పెదవిపై చిరునవ్వు జరగకుండా అందరిచే చక్కటి వినోదాన్ని విజ్ఞానాన్ని అందిస్తున్న జాదూగర్ శ్రీనివాస్ వర్మ అభినందనీయుడన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం అధినేత తోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY