Rajahmundry: రాజమహేంద్రవరంలో అక్టోబర్ 8, 9న అంతరిక్ష వారోత్సవాలు

Rajahmundry: రాజమహేంద్రవరంలో అక్టోబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇస్రో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల పోస్టర్, టీజర్‌ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 24 Sept 2026 5:25 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమహేంద్రవరంలో అక్టోబర్ 8, 9న అంతరిక్ష వారోత్సవాలు

రాజమండ్రి: .ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు రాజమహేంద్రవరం మరోమారు వేదిక కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో అక్టోబర్ 8 , 9 తేదీల్లో నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం నందు ఈ వారోత్సవాలు జరగనున్నాయి.

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ సంయుక్త సహకారంతో ఇస్రో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఇస్రో సివిల్ డివిజన్ హెడ్ వి.లక్ష్మణ సతీష్, సీనియర్ శాస్త్రవేత్త కె.అశ్విని గురువారం కమిషనర్ రాహుల్ మీనా ను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ.. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

ఇస్రో చేపట్టిన ప్రయోగాల రాకెట్ నమూనాలు ఈ వారోత్సవాల్లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అలాగే ఆరవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, స్పాట్ క్విజ్, స్పాట్ ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా సూచించారు. అనంతరం టీజర్ ను ఆవిష్కరించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY