Rajahmundry: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా
Rajahmundry: రాజమండ్రిలో వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో కమిషనర్ రాహుల్ మీనా క్షేత్రస్థాయి పరిశీలన. వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ పనులపై కీలక సూచనలు.
Rajahmundry: వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా
రాజమండ్రి: వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని హైటెక్ బస్టాండ్, క్వారీ మార్కెట్, దండి మార్చ్ జంక్షన్, లాలాచెరువు, జీ అండ్ టీ రోడ్డు సహా పలు ప్రాంతాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ పనితీరును పరిశీలించి, నీరు సజావుగా ప్రవహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, అవసరమైన చోట పూడికతీత పనులు చేపట్టాలన్నారు.
అలాగే రోడ్లపైన ఎక్కడా చెట్ల కొమ్మలు లేకుండా వెంటనే తొలగించాలన్నారు. ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు.




