Rajahmundry: అర్జీదారుల సంతృప్తే పనితీరుకు గీటురాయి కమిషనర్ రాహుల్ మీనా

Rajahmundry: రాజమండ్రిలో పీజీఆర్ఎస్ అర్జీలను కాలపరిమితిలోగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై సమీక్ష.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 5 Oct 2026 6:59 PM IST
Rajahmundry
X

Rajahmundry: అర్జీదారుల సంతృప్తే పనితీరుకు గీటురాయి కమిషనర్ రాహుల్ మీనా

రాజమండ్రి: ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని కాల పరిమితిలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు.

ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత విభాగాధిపతులకు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి తప్పనిసరిగా ఎక్నాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు తాము సమర్పించిన అర్జీల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 1100 నెంబర్ కు ఫోన్ చేయవచ్చన్నారు.

దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 19 అర్జీలు రాగా వీటిలో పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 2, ఇంజనీరింగ్ కి సంబంధించి 8, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 6, వార్డు సచివాలయాలకు సంబంధించి 2, హౌసింగ్ కు సంబంధించి ఒకటి ఉన్నాయి.

కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY