Rajahmundry: మున్సిపల్ అభివృద్ధి పనులపై అధికారులతో కమిషనర్ సమీక్ష!
Rajahmundry: రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు.
Rajahmundry: మున్సిపల్ అభివృద్ధి పనులపై అధికారులతో కమిషనర్ సమీక్ష!
Rajahmundry: నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పరిధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల వేగవంతంపై డివిజన్ల వారీగా సమీక్షించారు.
వివిధ దశలలో ఉన్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని.. ఇప్పటికే శంకుస్థాపనలు చేసిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. పూలే భవన్ పనులు నవంబర్ 15 నాటికి పూర్తి కావాలని ఆదేశించారు.
లలితానగర్‌లో స్ట్రోం వాటర్ డ్రెయిన్ పనులు డిసెంబర్ 15 కల్లా పూర్తి కావాలన్నారు. ధవళేశ్వరం దగ్గర పంపు హౌస్ పనులు నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి కావాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఏఈలు ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షించాలన్నారు.
అలాగే వర్షాల సమయంలో రోడ్లపై ఎక్కడా నీరు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకూడదని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే అరికట్టాలన్నారు. ప్రజల్లో సంతృప్తి ఉండేలా అభివృద్ధి పనులు జరగాలని.. క్షేత్రస్థాయిలో పజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలన్నారు. సమీక్షలో ఎస్ఈ రీటా, ఈఈలు మదర్షా అలీ, మాధవి, డీఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




