Rajahmundry: అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: కమిషనర్ రాహుల్ మీనా!

Rajahmundry: రాజమండ్రిలో రూ.1.50 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, డివైడర్ నాణ్యతను కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 5 Oct 2026 3:20 PM IST
Rajahmundry
X

Rajahmundry: అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: కమిషనర్ రాహుల్ మీనా!

Rajahmundry: అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. సోమవారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీలో రూ. కోటి 50 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు మరియు డివైడర్ నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనుల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కచ్చితంగా చెక్‌ చేయాలని సూచించారు. పర్యవేక్షణ చేసే ఇంజనీర్లు కూడా పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు.

ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించేలా.. గుంతలు లేని రహదారులను తీర్చిదిద్దడమే అత్యంత ప్రాధాన్యతాంశంగా ముందుకు వెళ్ళాలన్నారు. అలాగే రోడ్డుకిరువైపులా ఉన్న ఖాళీ స్థలాన్ని గ్రీనరీగా తయారుచేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా సూచించారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రహదారులు అందంగా కనిపిస్తాయని, ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందన్నారు. రాజమహేంద్రవరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడమే నగరపాలక సంస్థ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పర్యటనలో ఈఈ మదర్షా అలీ, ఎంహెచ్ఓ వినూత్న, ఏఈ రమేష్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY