Rajahmundry: రాజమండ్రిలో రూ.2.20 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Rajahmundry: రాజమండ్రి 29వ డివిజన్‌లో 25 ఏళ్ల రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు పరిష్కారంగా రూ.2.20 కోట్ల అభివృద్ధి పనులకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 11 Oct 2026 10:30 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో రూ.2.20 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

రాజమండ్రి: నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రూ.2.20 కోట్ల అంచనా వ్యయంతో రోడ్ల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.

స్థానిక 29వ డివిజన్‌లోని సోమాలమ్మ అమ్మవారి ఆలయం జంక్షన్ నుంచి అన్నపూర్ణమ్మపేట రైల్వే గేటు వరకు రూ.78 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నపూర్ణమ్మపేట రైల్వే గేటుకు ఇరువైపులా రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 29, 30వ డివిజన్ల పరిధిలో రూ.78 లక్షలతో రోడ్డు పునరుద్ధరణ పనులు, 28, 29, 30వ డివిజన్లను అనుసంధానించే ప్రధాన రహదారికి రూ.1.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

ఈ రెండు పనులకు కలిపి మొత్తం రూ.2.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అన్నపూర్ణమ్మపేట రైల్వే గేటు పరిసర ప్రాంతాల్లో గత 25 ఏళ్లుగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ, రోడ్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి, పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.

గత రెండు రోజులుగా నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లోనూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY