Rajahmundry: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిలిన చాంబర్ ఆఫ్ కామర్స్

Rajahmundry: రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిశారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 8 Oct 2026 7:52 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిలిన చాంబర్ ఆఫ్ కామర్స్

రాజమండ్రి: ప్రతిష్టాత్మకమైన ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్‌కు 2026–28 సంవత్సరాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకమండలి సభ్యులు గురువారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)ను తిలక్ రోడ్డులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే వాసుకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా వ్యాపారుల సమస్యలను సమన్వయంతో పరిష్కరించేందుకు, నగరంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నా రు. వ్యాపారులకు మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వాసు హామీ ఇచ్చారు.

వ్యాపార రంగం అభివృద్ధి చెందితే నగర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నూతన పాలకమండలి చాంబర్ ఆఫ్ కామర్స్‌ను మరింత బలోపేతం చేస్తూ, వ్యాపారుల సంక్షేమంతో పాటు నగర అభివృద్ధిలో భాగస్వామిగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే వాసు ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

అధ్యక్షులు మద్దుల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిరాజు, యియ్యపు మురళీధర్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు కనకాల రాజా, గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ (కన్న), కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగోళ్ల సురేష్‌కుమార్ డైరెక్టర్లు దొండపాటి జయసింహ, యిన్నమూరి ప్రదీప్, భేరూలాల్ జైన్, గునిశెట్టి విజయకిరణ్, మండవల్లి సత్యనారాయణమూర్తి (నాని), మునగ రమేష్, సలాది సుబ్రహ్మణ్యం, తాటి సత్యనారాయణ, ఉప్పులూరి బ్రహ్మాజీ, పామెర్ల వీరవెంకట సత్యనారాయణమూర్తి, పులవర్తి వీరవెంకటేశ్వరరావు (వెంకటేష్), కొంచ దుర్గాప్రసాద్, కొల్లేపల్లి వీరవెంకట సుభాష్, పురోహిత్ హనుమాన్ సింగ్, కొయ్యన కుమారి, ఎక్స్ అఫిషియో డైరెక్టర్ కాలెపు వెంకట వీరభద్రరావు, ట్రస్టుబోర్డు డైరెక్టర్ – శ్రీ గండి బ్రహ్మానందం (రాజా), ట్రస్టుబోర్డు డైరెక్టర్లు గ్రంధి బ్రహ్మానందం, నూలి శివ మల్లికార్జున (శివ), నామినేటెడ్ ట్రస్టీ యక్కల వీర నాగేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను కలిసిన వారిలో ఉన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY