Rajahmundry: రాజమండ్రిలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ సంఘం సర్వసభ్య సమావేశం
Rajahmundry: రాజమండ్రిలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ సంఘం సర్వసభ్య సమావేశం. గోదావరి పుష్కరాల్లో వైద్య సేవలు అందించాలని పలు కీలక తీర్మానాలు.
Rajahmundry: రాజమండ్రిలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ సంఘం సర్వసభ్య సమావేశం
రాజమండ్రి: బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నగర శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక దానవాయిపేట మ్యాక్సీవిజన్ హాస్పిటల్ ఆవరణలో జరిగింది. ఈ సమావేశానికి నగర శాఖ అధ్యక్షులు డి.రాజు, కార్యదర్శి గుప్తా, కోశాధికారి అజిత్ కుమార్ అధ్యక్షతన జరిగినది.
డాక్టర్ కావ్య, డాక్టర్ ప్రియంవద కంటిలో వచ్చే ఇబ్బందులు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదించారు.
రాబోయే గోదావరి పుష్కరాల్లో సంఘ సభ్యులు అందరూ ప్రభుత్వం సూచనల మేరకు ఆయా ఘాటుల్లో ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ అందించడానికి, గవర్నమెంట్ వైద్యులకు సహకరించడానికి, అత్యవసర పేషెంట్లను ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని తీర్మానం చేసారు.
గ్రామీణ, పట్టణ మురికివాడల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘ గౌరవ సలహాదారు ఆర్.శ్యామ్‌కుమార్, రాష్ట్ర సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వివి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎస్.రామలక్ష్మణ రావు, రాష్ట్ర సంఘ సహాయక కార్యదర్శి బర్రే నరసింహ మూర్తి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మురళీధర్, కోశాధికారి హరిదాసుల హరి తదితరులు పాల్గొన్నారు.




