Rajahmundry: రాజమండ్రిలో ఘనంగా 70వ స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నీస్ సెలక్షన్స్

Rajahmundry: రాజమండ్రిలో 70వ స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నీస్ సెలక్షన్ ట్రయల్స్ ప్రారంభం. మూడు జిల్లాల నుంచి హాజరైన 110 మంది అండర్-14, 17 క్రీడాకారులు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 28 Sept 2026 8:31 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో ఘనంగా 70వ స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నీస్ సెలక్షన్స్

రాజమండ్రి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 70వ స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నీస్ సెలక్షన్ ట్రయల్స్ తూర్పు గోదావరి జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక గౌతమీ టేబుల్ టెన్నీస్ అకాడమీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ ప్రారంభ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తూర్పు గోదావరి జిల్లా అర్గనైజింగ్ సెక్రటరీ వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, గౌతమీ టిటి అకాడమీ ప్రెసిడెంట్ అప్పారెడ్డి, విశిష్ట అతిధిగా లలిత్ జైన్,K. సత్యనారాయణ, కోచ్ సుబ్బారావు గారు, అడ్మిన్ ఎస్‌జిఎఫ్ సెక్రటరీ JKLN అన్నపూర్ణ, సీనియర్ రిటైర్డ్ పిడి ఎస్.గంగాధర్, జిల్లా పిడి/పిఇటిల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.నాగరాజు, సెక్రటరీ ఎస్.వీరబాబు, గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రాజశేఖర్, తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీB. త్రిమూర్తులు,SRKV స్వామి, సెలక్షన్ కమిటీ కన్వీనర్ పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ముఖ్య అతిథి మాట్లాడుతూ టీటీ వల్ల ఉద్యోగాల్లో జరిగే ప్రయోజనాలను వివరించారు. లలిత్‌జైన్ విజేతలకు బహుమతులు ఇస్తారని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ప్రెసిడెంట్ ఎస్.నాగరాజు మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్గనైజింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ శ్రీనివాస్, అన్నపూర్ణ మాట్లాడుతూ విజేతలను వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని క్రీడాకారులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. ఈ ఈవెంట్‌కి కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి మూడు జిల్లాల నుంచి సుమారు 110 మంది అండర్-14, 17 బాయ్స్ అండ్ గర్ల్స్ పాల్గొన్నారని ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలిపారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY