Amalapuram: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష!

Amalapuram: అమలాపురం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యురాలు పుణ్యమంతుల రజని పలు కీలక అంశాలపై చర్చించారు.

SURESH, AMALAPURAM
Published on: 30 Sept 2026 5:22 PM IST
Amalapuram
X

Amalapuram: ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష!

Amalapuram: ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులతో పాటు వారి యొక్క మౌలిక అంశాలపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యమంతుల రజని జిల్లా కలెక్టర్ ని మరియు అధికారులను కోరారు జూన్ నుండి సెప్టెంబర్ వరకు గల త్రైమాసికంలో చాలా వరకు ఎస్సీ,ఎస్టి కేసులు తగ్గు ముఖం పట్టాయని , మెరుగైన సమాజానికి ఇది శుభసూచకమని,ప్రజలందరూ కూడా కులమత భేదాలు లేకుండా అన్నదమ్ములు లాగా కలిసిమెలిసి ఉండాలని రజని ఆకాంక్షించారు.

గత సమీక్ష సమావేశంలో నివేదించిన ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అమలాపురం మండలంలోని భట్నవిల్లి,కాట్రేనికోన మండలంలోని గెద్దనపల్లి గ్రామానికి సంబంధించి రోడ్లు,డ్రైనేజీలు,స్మశానాల అభివృద్ధికి సంబంధించిన చర్యలను ఈ సమావేశంలో ఒక నివేదిక రూపంలో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు వారు తీసు కుంటున్న చర్యలను గురించి తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారికి రజనీ కృతజ్ఞతలు తెలియజేశారు. గత సమావేశంలో నివేదించిన అన్ని అంశాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని మరొకసారి అధికారులను కలెక్టర్ సమక్షంలో కోరడమైనది. ప్రస్తుత ఎస్సీ హాస్టళ్లకు సంబంధించిన మౌలిక వసతుల విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని,ప్రతి హాస్టల్లోనూ నాణ్యమైన భోజనం అందించే విధంగా చూడాలని అధికారులను కోరడమైనది.

వీటితోపాటు ఎస్సీ,ఎస్టి మహిళలు చాలామంది మోసగాళ్ల చేతిలో మోసపోతూ డబ్బుతో పాటు సమాజంలో తమ..తమ గౌరవాన్ని కోల్పోతున్నారు.తద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి.కొందరైతే గత్యంతరం ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.ఇటువంటి సంఘటనల వల్ల వారి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని అన్నారు.కాబట్టి సమాజంలోని ఆడవాళ్లకు ఇటువంటి మోసాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరడమైనది. అంతేకాకుండా ఆడపిల్లలపై తరచుగా అత్యాచారాలు జరుగుతున్న దృష్ట్యా ఆడపిల్లలకు కూడా ప్రతి పాఠశాలలోనూ మోటివేషన్ క్లాసులు ఇప్పించాలని కలెక్టర్ ని కోరడమైనది అని రజిని అన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM