Mummidivaram: రూ.47 వేల కరెంటు బిల్లు 10 నెలలుగా చీకట్లోనే పేద కుటుంబం!

Mummidivaram: కోనసీమ జిల్లా పల్లంకుర్రులో రూ.47 వేల విద్యుత్ బిల్లు చెల్లించలేదని 10 నెలలుగా కరెంట్ నిలిపివేయడంతో ఓ పేద కుటుంబం చీకట్లో జీవిస్తోంది.

M. Suneel Sastry, Mummidivaram
Published on: 13 Oct 2026 1:39 PM IST
Mummidivaram
X

Mummidivaram: రూ.47 వేల కరెంటు బిల్లు 10 నెలలుగా చీకట్లోనే పేద కుటుంబం!

Mummidivaram: పేద కుటుంబానికి రూ.47 వేల విద్యుత్‌ బిల్లు రావడం, దాన్ని చెల్లించలేదని విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో సుమారు 9–10 నెలలుగా చీకట్లోనే జీవిస్తున్నామని పల్లంకుర్రు ఆదిఆంధ్రపేటకు చెందిన తిరుకోటి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, జేఈని సంప్రదించినా స్పందన లేదని ఆమె వాపోయారు.

పేదవారి ఇంటికి రూ.47 వేల బిల్లు.. ఆ బిల్లు కట్టలేకపోతే నెలల తరబడి చీకటే శిక్షా? విద్యుత్‌ బిల్లు వసూలు చేయడంలో చూపుతున్న శ్రద్ధ, సమస్యను పరిశీలించి పరిష్కరించడంలో ఎందుకు కనిపించడం లేదని బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బిల్లు నిజానిజాలు పరిశీలించి, నిబంధనల ప్రకారం విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలని ఆమె కోరుతున్నారు.

M. Suneel Sastry, Mummidivaram

M. Suneel Sastry, Mummidivaram