Mamidikuduru: నగరం బత్తుల వారి పేటలో కలుషిత తాగునీరు.. అధికారులారా స్పందించండి!
Mamidikuduru: మామిడికుదురు మండలం నగరం బత్తుల వారి పేటలో కుళాయి నీటిలో మురికి, వానపాములు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Mamidikuduru: నగరం బత్తుల వారి పేటలో కలుషిత తాగునీరు.. అధికారులారా స్పందించండి!
Mamidikuduru: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని 9వ వార్డు బత్తుల వారి పేటలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుళాయిలకు సక్రమంగా నీటి సరఫరా లేకపోవడమే కాకుండా, అప్పుడప్పుడు వచ్చే నీటిలో మురికి, వానపాములు కనిపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో పైపులైన్లు మార్చి, ఎత్తు పెంచుతామని చెప్పి నగదు తీసుకుని పనులు చేపట్టినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
ఈ సమస్యపై స్పందించిన 9వ వార్డు మెంబర్ విజేత మహమ్మద్ లియాఖత్ అలీ, స్థానికుల ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన తాగునీటి సమస్యపై అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించాలి. పైపులైన్లను తనిఖీ చేసి, నీటి నాణ్యతను పరీక్షించి, బత్తుల వారి పేట ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




