Amalapuram: కోనసీమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

SURESH, AMALAPURAM
Published on: 2 Nov 2026 11:56 AM IST
Amalapuram
X

Amalapuram: కోనసీమ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్!

Amalapuram: అమలాపురం నియోజకవర్గం లోని ముమ్మిడివరం, రామచంద్రపురం పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ పూర్తి అయిది.బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరిచే ప్రక్రియ పూర్తి చేశారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు రాత్రంతా నిరంతర నిఘాలో ప్రక్రియ పూర్తి చేశారు.అని జిల్లా కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్,జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలియజేసారు.

కోనసీమ జిల్లా పరిధిలోని మూడు పట్టణ స్థానిక సంస్థలైన అమలాపురం,ముమ్మిడివరం, రామచంద్రపురం మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఆర్. మహేష్ కుమార్,జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలింగ్ సరళి, పోలింగ్ శాతం,బ్యాలెట్ బాక్సుల భద్రత,పోలీసు బందోబస్తు తదితర అంశాలపై వారు వివరాలు వెల్లడించారు.మూడు పట్టణాల్లో నమోదైన పోలింగ్ శాతం.జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

అమలాపురం మున్సిపాలిటీ: 71.87 శాతం, ముమ్మిడివరం నగర పంచాయతీ: 75.16 శాతం, రామచంద్రపురం మున్సిపాలిటీ: 70.73 శాతం

మూడు పట్టణాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు.ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు,ఎన్నికల సిబ్బంది,పోలీసు అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు.

సాయంత్రం 6.30 గంటల సమయానికి పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిందని కలెక్టర్ వివరించారు.పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని నిర్దేశిత రిసెప్షన్ కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి సంబంధిత స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 23 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను,రామచంద్రపురం మున్సిపాలిటీకి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే నిర్దేశిత స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.

అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కూడా నిర్దేశిత కేంద్రాలకు తరలించి భద్రపరిచే ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు.బ్యాలెట్ బాక్సుల సీలింగ్,భద్రపరిచే ప్రక్రియను ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటుచేసిన

జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ,మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక పోలీసు బలగాలను అందుబాటులో ఉంచి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టామన్నారు.

ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల సీలింగ్,స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాయుధ పోలీసు గార్డులను నియమించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

రాత్రి సమయాల్లోనూ రూట్ మొబైల్ పోలీసు బృందాల ద్వారా విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిరంతర నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి,బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

జిల్లా యంత్రాంగం,పోలీసు శాఖ సమన్వయంతో చేపట్టిన ముందస్తు చర్యలు,పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల ఫలితంగా మూడు పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్,ఎస్పీ పేర్కొన్నారు.తదుపరి ఎన్నికల ప్రక్రియ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్,ఎస్పీ తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM