Razole: అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు!
Razole: రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజోలు నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్.
Razole: అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు!
Razole: రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజోలు సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో సఖినేటిపల్లి, మలికిపురం ఎస్‌ఐలు మోహన్ కుమార్,హరికోటిశాస్త్రి తమ సిబ్బందితో కలిసి సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
మలికిపురం మండలంలో: మలికిపురం, లక్కవరం, బట్టేలంక, శంకరగుప్తం, కేశనపల్లి, తూర్పుపాలెం గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహించారు.
సఖినేటిపల్లి మండలంలో: కేశవదాసుపాలెం, అంతర్వేదికర, అంతర్వేది, పల్లిపాలెం గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, అవాంఛనీయ సంఘటనలకు కారణమైనా సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు, పారదర్శకమైన మరియు ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా స్పష్టం చేశారు.




