Yetapaka: పురుషోత్తపట్నంలో వైఎస్ఆర్సీపీకి ప్రజల బ్రహ్మరథం!
Yetapaka: పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థి సోడే నాగరత్నం గెలుపు కోసం నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
Yetapaka: పురుషోత్తపట్నంలో వైఎస్ఆర్సీపీకి ప్రజల బ్రహ్మరథం!
ఎటపాక: ఈనెల 29వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి సోడే నాగరత్నం గారి గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటికి తిరిగి సర్పంచ్ అభ్యర్థి నాగరత్నం గారి ఉంగరం గుర్తు పై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన వార్డు మెంబర్లందరినీ గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ ప్రచారంలో గ్రామ ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. మహిళలు, యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారు. అన్ని వార్డుల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాకా కామేశ్వరి , రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దామర్ల రేవతి, ఎక్స్ ఎంపీటీసీ, సోషల్ మీడియా మండల అధ్యక్షులు గొంగడి వెంకటరామిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు శీలం నాగేశ్వరరావు, పురుషోత్తపట్నం గ్రామ కమిటీ అధ్యక్షుడు సారెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ, అన్నెం జయచంద్ర రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సారెడ్డి శ్రీనివాసరెడ్డి, చందా చంద్రశేఖర్ రెడ్డి, దామెర్ల శ్రీనివాస్, బారెడ్డి లక్ష్మారెడ్డి, కొప్పుల సంతోష్, చెన్నకేశవ, శ్రీను, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.సర్పంచ్ అభ్యర్థి సోడే నాగరత్నం మరియు అన్ని వార్డుల మెంబర్లు కూడా ఈ ప్రచారంలో పాల్గొని ప్రజల ఆశీస్సులు కోరారు.




