Kunavaram: ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి మహేంద్ర!
Kunavaram: పోలవరం జిల్లా కూనవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సోడే మహేంద్ర ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతూ బుట్ట గుర్తుపై ఓట్లు అభ్యర్థించారు.
Kunavaram: ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి మహేంద్ర!
కూనవరం: కూనవరం మండలం కూనవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోడే మహేంద్ర ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి తిరిగి తన "బుట్ట గుర్తు" పై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని మహేంద్ర ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు.
మహేంద్ర ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. వెళ్లిన ప్రతి చోటా మహిళలు, యువకులు, పెద్దలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. "మా ఓటు మహేంద్రకే" అంటూ ఓటర్లు స్వయంగా మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో కూనవరంలో మహేంద్ర విజయం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహేంద్రకు అండగా నిలిచారు




